ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
GDWL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రజల నుంచి 103 అర్జీలను స్వీకరించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించాలని, వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వ వసతిగృహాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.