ఎల్లమ్మచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ఎల్లమ్మచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

MDCL: ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని ఎల్లమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. దీంతో స్థానికంగా నివాసితులు కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసే పనిలోపడ్డారు. మహిళ ఎవరు అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.