ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
KNR: గంగాధర మండలంలోని మధుర నగర్‌కు చెందిన దూస లత (45) తన నివాసంలో ఇవాళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గత ఏడాది కాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేక బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు పేర్కొన్నారు. మృతురాలి భర్త శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.