'ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి'
BDK: దిశ కమిటీ సమావేశంలో ఎంపీ పోరిక బలరాం నాయక్ బుధవారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించి, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుమూల ప్రాంతాల వరకు త్రాగునీటి సరఫరా కల్పించాలని, ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.