భారీగా వరద.. జూరాల 44 గేట్లు ఎత్తివేత

భారీగా వరద.. జూరాల 44 గేట్లు ఎత్తివేత

GDWL: కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో  అధికారులు ప్రాజెక్ట్ 44 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3.30 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 3.23 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.940 మీటర్లకు చేరుకుంది.