VIDEO: వరద ఉద్ధృతిలో డేరింగ్ రెస్క్యూ

భారీ వర్షాల ధాటికి పశ్చిమ సిక్కింలోని యాంగ్‌థాంగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురు వరద నీటిలో గల్లంతయ్యారు. మరోవైపు వరద ఉద్ధృతిలో చిక్కుకున్న మరో ఇద్దరు వ్యక్తులను కాపాడడానికి సిక్కిం పోలీసులు డేరింగ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని తాళ్లతో రక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.