'గర్భవతి తొలి 1000 రోజులు జాగ్రత్తగా ఉండాలి'
ప్రకాశం: కనిగిరి మండలం కంచర్లవారి పల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో '8వ పోషణ పక్వాడ–2026' వేడుకలు ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.వీ.ఎస్. పార్వతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా టాటా ట్రస్ట్ ప్రోగ్రాం అసోసియేట్ డీ. గోపి పాల్గొన్నారు. గర్భధారణ నుంచి తొలి 1000 రోజులు అత్యంత కీలకమని, తల్లి-శిశు ఆరోగ్యానికి పోషకాహారం, జాగ్రత్తలు పాటించడం అవసరమని వారు చెప్పుకొచ్చారు.