VIDEO: 'సాగునీటి కొరతతో రైతులకు నష్టాలు'
WGL: దేవాదుల ఎత్తిపోతల కాలువల ద్వారా సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. శనివారం ఏఐకేఎఫ్ బృందం సభ్యులు వర్ధన్నపేట మండలం చెన్నారంతో పలు గ్రామాల్లో పంటలను సందర్శించారు. ఈ మేరకు రైతుల సమస్యలను తెలుసుకుని తక్షణమే కాలువలను మరమ్మతు చేసి సాగునీరు అందించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.