ఆలమట్టిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: డీకే
ఆలమట్టి జలాశయం నుంచి రాష్ట్ర వాటా నీటిని వినియోగించుకోవడం తమ హక్కు అని కర్ణాటక Dy CM డీకే శివకుమార్ వెల్లడించారు. ఇందుకోసం డ్యాం ఎత్తును అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ఎత్తుకు సంబంధించిన భూ సేకరణ పనులు, పరిహారం చెల్లింపులను అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు.