'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'
SKLM: పలాస నియోజకవర్గంలోని అసంపూర్తిగా మిగిలిపోయిన మూడు కీలక రహదారుల నిర్మాణమే లక్ష్యం అని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్‌ను కలిసి నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేసి వినతి పత్రాన్ని అందించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మధ్యలోనే ఆగిపోయిన రోడ్ల నిర్మాణానికి నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.