అమెరికాపై ఇరాన్ ఆరోపణలు
ఇరాన్‌లోని మషాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారత్‌కు వచ్చి ఔషధాలను తీసుకెళ్లాల్సిన ఓ పౌర విమానంపై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ఆరోపణలు చేసింది. మానవీయ కోణంలో సాగుతున్న ఈ సరఫరాపై దాడి జరగడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానం భారత్ చేపట్టిన హ్యూమానిటేరియన్ కారిడార్‌లో భాగమని తెలుస్తోంది. ఈ ఘటనతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో స్థాయికి చేరాయి.