'సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'

'సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'

కోనసీమ: ఇటీవల పిఠాపురం మండలం మల్లంలో దళితులను సాంఘిక బహిష్కరణకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి డిమాండ్ చేసింది. దీనిపై అమలాపురం కలెక్టరేట్లో సోమవారం సమితి ప్రతినిధులు వినతిపత్రం అందించారు. సాంఘిక బహిష్కరణకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.