‘నా కోరిక ఒక్కటే.. మా ఫ్యామిలీ అంతా కలవాలి’
నటి మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. తనకు ఉన్న ఏకైక కోరిక.. తన కుటుంబమంతా కలిసి ఉండటమేనని మనసులో మాట బయటపెట్టారు. గతంలో మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మా కుటుంబం అంతా ఒక్కచోట ఉండాలి' అని లక్ష్మి కోరుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.