ఆటో టైర్ కింద పడి 18 నెలల చిన్నారి మృతి
TG: నిజామాబాద్ జిల్లా సాలూర మండలం సాలంపాడ్‌లో ఆటో కింద 18 నెలల చిన్నారి పడి చనిపోయింది. ఇంటి ముందుకు ఆటోలో ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చిన బోధన్‌కు చెందిన వ్యాపారి అబ్దుల్ ఖాదర్ వద్దకు తల్లి అయేషాబేగం వెళ్లింది. ఆమె వెనకే చిన్నారి (18 నెలలు) కూడా పాకుతూ వచ్చింది. బేరం కుదరక ఖాదర్ ఆటో ముందుకు పోనిచ్చాడు. పాపను గమనించకపోవడంతో ఆటో టైరు.. పాప తలపై నుంచి వెళ్లింది.