శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. స్వామి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,294 మంది భక్తులు దర్శించుకోగా.. 26,796 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.4.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.