బెట్టింగ్ లకు పాల్పడితే చర్యలు తప్పవు: ఎస్సై

బెట్టింగ్ లకు పాల్పడితే చర్యలు తప్పవు: ఎస్సై

NLR: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌లపై అప్రమత్తంగా ఉండాలని లింగసముద్రం ఎస్సై రాంబాబు సోమవారం హెచ్చరించారు. బెట్టింగ్‌ల వల్ల మోసపోవడంతో పాటు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో ఎవరూ బెట్టింగ్‌లకు పాల్పడవద్దని సూచించారు. బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.