కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
JGL: మేడిపల్లి మండల కేంద్రంలో మార్క్ ఫెడ్ సౌజన్యంతో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులు పండించిన మొక్కజొన్నను దళారులకు ప్రైవేట్ వ్యాపారులకు నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.