ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు

ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు

RR: ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలానికి సంబంధించిన ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందన్నారు. విద్యారంగ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.