పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

VZM: బొండపల్లి మండలంలోని రయంద్రం గ్రామంలో జూద శిబిరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసినట్లు బొండపల్లి ఎస్సై యు.మహేష్ సోమవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 30,350 నగదుతో పాటు జూద పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.