డిసెంబర్ 5న మహా ధర్నా
BPT: అద్దంకిలోని సుందరయ్య భవనం నందు శుక్రవారం వీఆర్ఏల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్న వీఆర్ఏల సమస్యల పరిష్కారం కాలేదని అన్నారు. సమస్యలపై డిసెంబర్ 5న కలెక్టర్ కార్యాలయం వద్ద మహా ధర్నా జరుగుతుందన్నారు.