నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు NDA పిలుపు
దేశవ్యాప్తంగా ఇవాళ ఆందోళనలకు ఎన్డీయే పిలుపునిచ్చింది. మహిళా బిల్లుపై విపక్షాల తీరును నిరసిస్తూ నిరసన చేపట్టనున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు కాలరాశాయని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.