రాచర్ల మండలంలో పలు పంటల పరిశీలన
ప్రకాశం: రాచర్ల మండలంలోని అనుమలవీడు గ్రామంలో బుధవారం ఉద్యానశాఖ అధికారి శ్వేత పలు పంటలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని స్ప్లింకర్ పైపులను, బిందు సేద్య పరికరాలను తనిఖీ చేశారు. రైతులందరూ తప్పకుండా బిందు, తుంపర సేద్యాన్ని అవలంభించాలని ఉద్యాన శాఖ అధికారి శ్వేత అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.