FLASH: కారంపూడి వీర్ల తిరుణాలలో అపశృతి

FLASH:  కారంపూడి వీర్ల తిరుణాలలో అపశృతి

PLD: కారంపూడి వీర్ల తిరుణాలలో విషాదం చోటుచేసుకుంది. నాగులేరులో వీర్ల కొణతాలు కడుగుతున్న 8 మందికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో చిలకలూరిపేటకు చెందిన జలయ్య మృతి చెందగా, పుల్లల చెరువు‌కు చెందిన అంకమ్మ రాజు పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వీర్ల గుడికి విద్యుత్ సప్లై ఇచ్చిన కరెంటు తీగ తెగి నాగులేరులో పడటంతో ఘటన జరిగింది.