మంత్రికి గౌడ సంఘం వినతి పత్రం
MGL: హైదరాబాద్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ములుగు, జనగామ జిల్లాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని, గౌడ పేద విద్యార్థుల కోసం హాస్టల్ భవనానికి ఎకరం భూమి కేటాయించాలని కోరారు.