గడి బురుజుల భూములను కాపాడుకుందాం: ఎమ్మెల్యే
JGL: కోరుట్లలో గడి బురుజుల భూములను కాపాడుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరసన దీక్షలో పాల్గొని ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. గడిబురుజు భూములపై విధించిన వీఎల్టీ పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాగా తీసుకుని విఎల్టీల రద్దుకు కృషి చేస్తనని తెలిపారు.