కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి

కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి

WGL: కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి చెందిన ఘటన పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వాంకుడోత్ బాలుకు చెందిన ఎద్దు పొలంలో దున్నుతుండగా బోర్‌కు ఉన్న విద్యుత్ వైర్ తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.