కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ దంపతులు
BHPL: మహాదేవపూర్ మండలం కుదురుపల్లె గ్రామ మాజీ సర్పంచ్ గట్టయ్య-సరిత దంపతులు బీఆర్ఎస్ పార్టీని విడిచి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, చల్ల తిరుపతిరెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ కొట్టగిరి రాజబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.