నీట్ పరీక్ష కోసం వరంగల్ పోలీసులు అలర్ట్

నీట్ పరీక్ష కోసం వరంగల్ పోలీసులు అలర్ట్

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరిగే నీట్ (యూజీ) పరీక్ష సజావుగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగే పరీక్షకు అభ్యర్థులను ఉదయం 11 నుంచి 1:30 గంటల వరకు మాత్రమే అనుమతించాలని, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు, 163 BNS/144 సెక్షన్ అమలు చేయాలని కమిషనర్ ఆదేశించారు.