ఢిల్లీ చేరుకున్న మయన్మార్ సైబర్ నేర బాధితులు
AP: ఉద్యోగాల పేరిట మోసపోయి మయన్మార్, థాయ్‌లాండ్ సరిహద్దులో చిక్కుకున్న పలువురు సైబర్ బాధితులు ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి చెందిన 11 మందితోపాటు తెలంగాణకు చెందిన మరో 11 మంది ఏపీ, తెలంగాణ భవన్‌లకు చేరుకున్నారు. అక్కడి అధికారులు శనివారం మధ్యాహ్నం లోపు బాధితులను స్వస్థలాలకు చేర్చనున్నారు.