మేడారం వనదేవతల జాతరకు @43 రోజులే!
ములుగు: మేడారం మహాజాతర దగ్గర పడుతోంది. జాతరకు ఇంకా 43 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే భక్తులు ముందస్తు మొక్కులకు తరలివస్తున్నారు. అయితే, ఆలయ అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జాతరలోపు పనులు పూర్తవుతాయా?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మంత్రి పొంగులేటి పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భక్తుల రాకతో అంతరాయం ఏర్పడుతుంది.