వేడుకగా కళ్యాణోత్సవం

వేడుకగా కళ్యాణోత్సవం

CTR: సోమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మొలకల పౌర్ణమి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. ఆలయంలోని మూలవిరాట్‌లో విశేష పుష్పాలంకరణ చేశారు. అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కళ్యాణం జరిపించారు. అర్చకులు మోహన్ బాబు, వేణుగోపాల్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.