జాడి జమాల్పూర్ సర్పంచ్ బరిలో యువతి నిహారిక
NZB: సాలూర మండలంలోని జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు నిహారిక సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి, హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఆమె, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రధాన పార్టీ మద్దతుతో గురువారం ప్రచారం నిర్వహించారు. గ్రామ సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.