మాజీ ఎంపీటీసీ మృతికి విశ్వేశ్వర రెడ్డి నివాళి
ATP: వజ్రకరూరు మండలం రాగులపాడు మాజీ ఎంపీటీసీ ఎం.రామాంజినేయులు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి రాగులపాడులోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.