VIDEO: ఆళ్లగడ్డలో రేషన్ డీలర్లతో తహసీల్దార్ సమీక్ష

NDL: ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి రేషన్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా సకాలంలో సరకులు అందజేయాలని ఆమె ఆదేశించారు. కాగా, మండలంలోని అన్ని గ్రామాల రేషన్ డీలర్లు సమావేశంలో పాల్గొన్నారు.