నేడు సబ్ స్టేషన్‌లో విద్యుత్ అంతరాయం
NZB: ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం ఇందల్వాయి సబ్ స్టేషన్‌లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ మూర్తి తెలిపారు. ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో చెట్ల కొట్టే పనుల నిమిత్తం ఈ మరమ్మత్తులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అంతరాయానికి మండల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.