ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NGKL: కల్వకుర్తి పట్టణంలో నేడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పర్యటిస్తారని స్థానిక కాంగ్రెస్ నేతలు తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని కోరారు.