ఈ నెల 9న 'హిందూ సమ్మేళనం'
NRML: భోసి గ్రామంలోని మహాదేవ్ మందిరం వద్ద ఈ నెల 9న 'హిందూ సమ్మేళనం' నిర్వహించనున్నట్లు అధ్యక్షులు నాగేందర్ పటేల్ తెలిపారు. RSS శతాబ్ది ఉత్సవాలలో భాగంగా జరిగే ఈ కార్యక్రమానికి కమలానంద భారతి స్వామీజీ, నర్రా శివకుమార్ హాజరుకానున్నారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, ధర్మ రక్షణే లక్ష్యంగా జరిగే ఈ సమ్మేళనానికి ప్రజలందరూ కుటుంబంతో రావాలని కోరారు.