నీటిపారుదల శాఖ అదికారులతో ఎమ్మెల్యే సమీక్ష

VZM: చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు తోటపల్లి నీటి పారుదల శాఖ అధికారులతో బుధవారం రాజాం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని చివరి ఎకరం భూమికి నీరు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వరి నాట్లకు రైతులు సిద్ధంగా ఉన్నందున తక్షణమే సాగునీరు అందించాలన్నారు.