VIDEO: దట్టమైన పొగమంచు.. రాకపోకలకు అంతరాయం
KNR: సైదాపూర్ మండలాన్ని బుధవారం దట్టమైన పొగ మంచు కమ్మేసింది. వేకువజామున భారీగా పొగ మంచు కురవడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనుచూపుమేరలో పొగ మంచు ఉండటంతో చలికి ప్రజలు వణికిపోయారు. సైదాపూర్- మొలంగూర్ ప్రధాన రహదారిపై ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లైట్లు వేసుకొని ముందుకు సాగామని స్థానికులు తెలిపారు.