శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తివేత

నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 25 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రావు గుప్త తెలిపారు. ఇన్‌ఫ్లో లక్ష 50 వేల క్యూసెక్కులు ఉండటంతో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి నదిలోకి ఈతకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు.