కేజీబీవీనీ సందర్శించిన ఆర్డిఓ

కేజీబీవీనీ సందర్శించిన ఆర్డిఓ

MDK: మనోహరాబాద్ మండలం కుచారం కేజీబీవీనీ తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో పరస్పర చర్చలు జరిపి, పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలు, హాస్టల్ సౌకర్యాలు, మధ్యాహ్న భోజన వసతులను పరిశీలించారు. భవనం, శుభ్రతా పరిస్థితులు, మౌలిక వసతులను తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బాలికలకు నాణ్యమైన విద్య అవసరమన్నారు.