పేకాట స్థావరంపై దాడి.. 5 మంది అరెస్ట్
W.G: నరసాపురం పార్క్ రోడ్డులోని ఓ డార్మిటరీలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.31,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జయలక్ష్మి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.