గుంటూరు కలెక్టర్ పేరిట నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్..!

గుంటూరు కలెక్టర్ పేరిట నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్..!

గుంటూరు జిల్లా కలెక్టర్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. “సీఎం సాయి కాంత్ వర్మ IAS” పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతా అసలు అధికారికది కాదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ “District Collector Guntur” మాత్రమేనని వెల్లడించారు. ప్రజలు నకిలీ అకౌంట్‌లను నమ్మి మోసపోవద్దన్నారు.