‘మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించండి’

SKLM: మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నరసన్నపేట సర్కిల్ ఆఫీస్‌లో మహిళ పోలీసులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ప్రతిరోజు పర్యటించి మహిళా చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీని వలన మహిళా చైతన్యం కలగడం వలన కొంతవరకు నేరాలు తగ్గుతాయని అన్నారు.