చెత్తతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

చెత్తతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

MNCL: జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు చెత్తకు నిలయంగా మారుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో చెత్త చెదారం వేయడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో దోమలు పెరిగి విష జ్వరాల బారిన పడుతున్నామని వారు వాపోయారు.