ఏడుపాయలలో కొనసాగిన వరద ఉధృతి

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల పుణ్యక్షేత్రంలో మంజీరా నది ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం ప్రధాన ఆలయం ఎదుట నది పరవళ్లు తొక్కుతోంది. గత 8 రోజుల నుంచి వన దుర్గమ్మ ఆలయం మూసివేశారు. అప్పటివరకు స్థానిక రాజగోపురం వద్ద దుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.