VIDEO: గుడిలో చోరీ.. పట్టుకున్న స్థానికులు..!
ఏలూరు: జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురం చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న గుడిలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని బుధవారం స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని స్తంభానికి తాళ్లతో బంధించారు. అలాగే ఈ వ్యక్తి గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.