ఉపాధి హామీ పనులను పరిశీలించిన MPDO
NZB: బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామ శివారులో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను మంగళవారం ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు కల్పిస్తున్న వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కూలీలు పని ప్రదేశంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంఎస్ఓ శ్రీనివాస్, ఏపీవో రజిని మరియు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు