ఇటుక బట్టీ కార్మికులకు వైద్య పరీక్షలు
KNR: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో వెలిచాలలోని ఇటుక బట్టీల వద్ద ఉచిత వైద్య శిబిరంతో పాటు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. రాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు.