కూసం మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్
WGL: గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన తెలంగాణ పల్లెగా, గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో రాజమౌళిది కీలక పాత్ర అని, దేశంలోని గ్రామాలు ఒక ఆదర్శవంతమైన సర్పంచ్‌ను కోల్పోయాయని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.